సినిమా సాంకేతికపరంగా చాలా మార్పులు సంతరించుకుంటోంది. అలాగే ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి పరిశ్రమ వర్గాలు సరికొత్త ప్రయోగాలు చేయక తప్పని పరిస్థితి ఆ విధంగా ఒక ప్రయోగాత్మక చిత్రంగా నడు ఇరవు అనే చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు 24 గంటల్లో స్వయం వరం అనే చిత్రాన్ని తెరకెక్కించి తమిళ చిత్ర పరిశ్రమలో రికార్డు సృష్టించింది. తాజాగా 12 గంటల్లనే నడు ఇరవు (నడి రేయి) చిత్ర రూపకల్పనకు రంగం సిద్ధం అయ్యింది. జయలక్ష్మీ మూవీస్ పతాకంపై వి.ఎస్.మోహన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందరూ నూతన తారాగణం నటించనున్నారు.
పుదుగై మారిసా కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ నెల 19న సాయంత్రం ఆరు గంటలకు షూటింగ్ ప్రారంభించి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు అంటే 12 గంటల్లో చిత్ర షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇది హరర్ కథా చిత్రం కావడంతో ప్రముఖ నటీనటులు అవసరం లేదన్నారు. చిత్రంలో మోనిక అనే బాల నటి ప్రముఖ పాత్ర పోషించనుందని చెప్పారు. చిత్ర షూటింగ్ ముహూర్తం కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలో గల ఏవీఎం స్టూడియోలో నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు కె.ఆర్, కలైపులి జి.శేఖరన్, దర్శక నిర్మాత శక్తి చిదంబరం తదితర పలువురు చిత్ర ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
రికార్డ్ కోసం మరో చిత్రం
Published Mon, Sep 15 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement
Advertisement