నయనతార
ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. అనగానే ఏదైనా వేలం పాట నిర్వహిస్తున్నారా? అనే అనుమానం రాకమానదు. ఇక్కడ మూడోసారితో ఆగడానికి వీళ్లేదు. నాలుగోసారి.. అనాల్సిందే. ఇంతకీ ఈ కహానీ ఏంటంటే.. ఇప్పటికే ముచ్చటగా మూడు సార్లు జోడీ కట్టిన హీరో అజిత్, హీరోయిన్ నయనతార నాలుగోసారి కలిసి నటించనున్నారు. ‘బిల్లా, ఏగన్, ఆరంభమ్’ చిత్రాలతో సూపర్‌హిట్ జోడీ అనిపించుకుని హ్యాట్రిక్ హిట్స్ సాధించారు అజిత్, నయన్. అందుకే కాబోలు మరోమారు ఈ క్రేజీ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తున్నారు. ‘వివేగం’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత అజిత్ ‘విశ్వాసం’ అనే సినిమాలో నటిస్తున్నారు.
అజిత్‌తో ‘వీరం, వేదాళం, వివేగం’ వంటి సూపర్ హిట్స్‌ని తెరకెక్కించిన శివ ‘విశ్వాసం’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్–శివ కాంబినేషన్‌లోనూ ఇది నాలుగో చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేశ్, తమన్నా, కాజల్ అగర్వాల్.. ఇలా పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. తాజాగా నయనతారను కథానాయికగా చిత్రవర్గాలు ప్రకటì ంచడంతో హీరోయిన్ ఎవరనే చర్చకు ఫుల్‌స్టాప్ పడింది. హాట్రిక్ హిట్స్ అందుకున్న అజిత్–నయనతార ‘విశ్వాసం’తో డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారని ఇద్దరి అభిమానులూ అనుకుంటున్నారు. దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment