కోల్‌కతాలో పవర్‌ఫుల్‌గా... | Ravi Teja's 'Power' To Shoot In Kolkata In March first week | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో పవర్‌ఫుల్‌గా...

Published Mon, Feb 24 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

కోల్‌కతాలో పవర్‌ఫుల్‌గా...

కోల్‌కతాలో పవర్‌ఫుల్‌గా...

రవితేజ స్టైల్, ఆయన నటన.. మాటతీరు... వీటిని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎనర్జీ లెవెల్స్ క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘పవర్’. ఈ సినిమా ద్వారా ‘బలుపు’ చిత్ర కథారచయిత కేఎస్ రవీంద్ర (బాబి)ని దర్శకునిగా పరిచయం చేస్తూ రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 24 వరకూ హైదరాబాద్‌లో ఈ సినిమా రెండో షెడ్యూల్ జరిగింది. ఇప్పటివరకూ ఇంట్రవెల్ ఎపిసోడ్ మినహా... ప్రథమార్ధం టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణను కూడా దర్శకుడు బాబీ పూర్తి చేశారు. మార్చి తొలివారంలో కోల్‌కతా షెడ్యూల్ మొదలవుతుంది.
 
  నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మేజర్ టాకీ పార్ట్ కూడా చిత్రీకరించనున్నట్లు తెలిసింది. అట్నుంచి అటే... యూనిట్ బ్యాంకాక్ వెళుతుంది. రవితేజ కెరీర్‌లో లాండ్‌మార్క్‌లా మిగిలిపోయేలా ఈ చిత్రం ఉండబోతోందని, ఆయన పాత్ర చిత్రణ కూడా విభిన్నంగా ఉంటుందని ఫిలింనగర్ టాక్. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాగిణీకన్నా, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, రావురమేష్, ముఖేష్ రుషి, సుబ్బరాజు, సురేఖవాణి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: కోనవెంకట్, సంగీతం: తమన్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్, కూర్పు: గౌతంరాజు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement