మొదటి శుభలేఖ ఆమెకే! | She won the first subhalekha! | Sakshi
Sakshi News home page

మొదటి శుభలేఖ ఆమెకే!

Published Thu, Jun 25 2015 12:07 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మొదటి శుభలేఖ ఆమెకే! - Sakshi

మొదటి శుభలేఖ ఆమెకే!

కరీనా కపూర్-షాహిద్ కపూర్ జంట బాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో ఒకటి. వీళ్లిద్దరూ కొన్నాళ్లపాటు రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ అద్భుతంగా రొమాన్స్ పండించేశారు. వీరిద్దరి ప్రేమ ముదిరి పెళ్లి వరకూ వెళ్లిపోతుందని, ఇక మూడు ముళ్ల బంధంతో ఒకటవడమే ఆలస్యమని బాలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. సడన్‌గా ఏమైందో తెలీదు... ఇద్దరూ బ్రేకప్ అయి, అందరికీ షాక్ ఇచ్చారు.
 
 ఆ తర్వాత వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఇక ఆ తర్వాత  కరీనా కపూర్ -సైఫ్‌లు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అన్నీ టకటకా జరిగిపోయాయి. త్వరలో షాహిద్‌కపూర్ కూడా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
 
 దీని గురించి మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. అసలు షాహిద్ కపూర్ తన పెళ్లికి మాజీ ప్రేయసి కరీనాను పిలుస్తాడా? లేదా అని మీడియా కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ విషయమై జరుగుతున్న చర్చలకు ఫుల్‌స్టాప్ పెడుతూ షాహిద్ తన పెళ్లి మొదటి శుభలేఖతో సైఫ్ దంపతులను స్వయంగా ఇంటికెళ్లి ఆహ్వానించాడట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement