పాలసీ మార్చుకున్న ఆనంది | Trying for glamor characters ... aanandhi | Sakshi
Sakshi News home page

పాలసీ మార్చుకున్న ఆనంది

Published Sat, Sep 2 2017 4:11 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

పాలసీ మార్చుకున్న ఆనంది

పాలసీ మార్చుకున్న ఆనంది

తమిళసినిమా:  కోలీవుడ్‌లో కథానాయకిగా గుర్తింపు పొందిన అతి కొద్ది మంచి తెలుగమ్మాయిల్లో ఆనంది ఒకరు. కయల్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతైన ఈ భామకు ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది. అంతేకాదు పక్కింటి అమ్మాయిగా చాలా హోమ్లీగా ఉందనే ప్రశంసలు అందుకుంది. కయల్‌ చిత్రం తరువాత అధర్వ, జీవీ.ప్రకాశ్‌కుమార్‌ వంటి యువనటులతో జత కట్టింది. అయితే ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు, కడవుల్‌ ఇరుక్కాన్‌ కుమారు, రుపాయ్‌ వంటి చిత్రాలు ప్రేక్షకాదరణను నోచుకోకపోవడంతో ఆనంది మార్కెట్‌ డౌన్‌ అయ్యింది.

ఇందుకు మరో కారణం హోమ్లీ ఇమేజ్‌ ముద్ర పడడం. ఆనంది అనగానే గ్లామర్‌కు వర్కౌట్‌ కాదు అనే ముద్ర పడిపోయింది. ఆ మధ్య జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో నటిం చిన త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో తనను అశ్లీల దృశ్యాల్లో నటింపజేశారని ఆ చిత్ర దర్శకుడిపై ఆరోపణలు గుప్పించిం ది. క్యాథరిన్‌ ట్రెసా లాంటి హీరోయిన్లు టూ పీస్‌ దుస్తుల్లో దుమ్మురేపుతూ కుర్రకారును విపరీతంగా అలరి స్తూ దూసుకుపోతుంటే ఆనం ది ఇంకా గ్లామర్‌ తన బాడీకి సరిపడదు అంటూ మడికట్టుకు కూర్చుంటోందనే ప్రచారం జరుగుతోంది.

దీంతో కమర్షియల్‌ చిత్రాల అవకాశాలు ఆనంది దరి చేరడం లేదు. కథానాయకిగా పరిచయమై చాలా కాలమే అవుతున్నా, ఇప్పటికీ ప్రముఖ హీరోల సరసన నటించే స్థాయికి చేరుకోలేకపోయింది. పరిస్థితిని బేరీజు వేసుకున్న ఆనంది ఇక లాభం లేదు. గ్లామర్‌ గోదాలోకి దిగాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చిందట. అంతే కాదు ఇప్పుడు సిన్సియర్‌గా గ్లామర్‌ పాత్రల కోసం ప్రయత్నాలు మొదలెట్టిందట. మరి ఆనందికి అందుకు తగ్గ అవకాశాలు వస్తాయా? వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మన్నర్‌ వగేరా, ఎన్నోడ ఆళు చెరుప్ప కానోం మూడు చిత్రాలు ఆనంది చేతిలో ఉన్నాయి. ఈ చిత్రాలన్నా తన ఆశలను చిగురింపజేస్తాయో లేదో! 

Advertisement
Advertisement