పారిస్‌లోని ఐఏఎఫ్‌ ఆఫీస్‌లో చొరబాటు | Attempted break-in at IAF's Paris office handling Rafale procurement | Sakshi
Sakshi News home page

పారిస్‌లోని ఐఏఎఫ్‌ ఆఫీస్‌లో చొరబాటు

Published Thu, May 23 2019 5:01 AM | Last Updated on Thu, May 23 2019 5:01 AM

Attempted break-in at IAF's Paris office handling Rafale procurement - Sakshi

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కార్యాలయంలోకి ఆదివారం కొందరు దుండగులు చొరబడ్డారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇది గూఢచారుల పని అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన గురించి అటు ఐఏఎఫ్‌ కానీ, ఇటు రక్షణ మంత్రిత్వ శాఖగానీ ఏ ప్రకటనా చేయలేదు. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను భారత్‌ కొనుగోలుచేస్తుండటం తెల్సిందే. ఆ విమానాల తయారీని ఈ ఆఫీస్‌ పర్యవేక్షిస్తోంది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలను దొంగిలించేందుకే దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించారనే అనుమానాలు ఉన్నాయి. స్థానిక పోలీసులు కేసును విచారిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement