ఘనంగా ముగిసిన ‘ఇఫి’ వేడుకలు
పణజీ: తూర్పు తైమూర్ తొలి చిత్రం ‘బీట్రిజ్ వార్’ 44వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో(ఇఫి) నీరాజనాలు అందుకుంది. దీన్ని ఉత్తమ చిత్రంగా జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. దర్శకుడు బెటిరీస్, సహదర్శకుడు ల్యూగీఆక్విస్టో దీన్ని తెరకెక్కించారు. ఉత్తమ దర్శకుడి అవార్డును ‘అపూర్ పాంచాలి’ సినిమాకుగాను బెంగాలీ చిత్ర దర్శకుడు కౌశిక్ గంగూలి దక్కించుకున్నారు.
గోవా రాజధాని పణజీలో 10 రోజులుగా జరుగుతున్న చలన చిత్రోత్సవాలు అవార్డుల సందడితో శనివారం ఘనంగా ముగిశాయి. కేంద్ర మంత్రి మనీష్ తివారీ, మలేసియన్ నటి మిషెల్లే యెహ్ తదితరులు బీట్రిజ్‌వార్ చిత్ర యూనిట్‌కు బంగారు నెమలితోపాటు రూ. 40లక్షల నగదు బహుమతిని ప్రదానం చేశారు.
ఉత్తమ చిత్రంగా ‘బీట్రిజ్ వార్’
Published Sun, Dec 1 2013 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement