చెట్టును ఢీకొంటే.. బస్సును తగులబెట్టారు! | Bus rams into a tree in Dewas area of Madhya Pradesh, one dead and more than 12 people injured | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొంటే.. బస్సును తగులబెట్టారు!

Published Sun, Jun 5 2016 9:41 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

చెట్టును ఢీకొంటే.. బస్సును తగులబెట్టారు!

చెట్టును ఢీకొంటే.. బస్సును తగులబెట్టారు!

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దివాస్‌ ప్రాంతంలో ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 12 మందికి గాయాలయ్యాయి. అతివేగంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టువైపు దూసుకెళ్లింది. చెట్టును బలంగా ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు.

స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై ఆగ్రహించిన అక్కడి స్థానికులు బస్సుకు నిప్పుపెట్టినట్టు తెలిసింది. దాంతో బస్సు మంటల్లో దగ్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement