‘బ్లూవేల్‌’ లింక్‌లను తొలగించండి | Centre orders Google, Facebook, WhatsApp to remove Blue Whale game | Sakshi
Sakshi News home page

‘బ్లూవేల్‌’ లింక్‌లను తొలగించండి

Published Wed, Aug 16 2017 12:53 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

‘బ్లూవేల్‌’ లింక్‌లను తొలగించండి - Sakshi

‘బ్లూవేల్‌’ లింక్‌లను తొలగించండి

ఇంటర్నెట్‌ దిగ్గజాలను ఆదేశించిన ప్రభుత్వం  
న్యూఢిల్లీ:
ప్రమాదకర ‘బ్లూవేల్‌ చాలెంజ్‌’ గేమ్, ఆ తరహా ఆన్‌లైన్‌ ఆటలకు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణం తొలగించాలని కేం ద్రం ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆగస్టు 11న గూగుల్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్‌లకు ఓ లేఖ రాసింది. 50 రోజులపాటు సాగే బ్లూవేల్‌ ఆన్‌లైన్‌ గేమ్‌లో చివరి టాస్క్‌ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్‌లో లీనమై ఇటీవల మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్‌లో ఒకరు పాఠశాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

ప్రభుత్వ నిర్ణయాన్ని భారత ఇంటర్నెట్‌ సేవల సరఫరాదారుల (ఐఎస్‌పీ) సంఘం సమర్థించింది. సామాజిక మాధ్యమాలు ప్రభుత్వం ఆదేశించే వరకు నిర్లక్ష్యం వహించకుండా... ఈ గేమ్‌ వ్యాప్తి చెందకుండా ముందే అడ్డుకోవాల్సిందనీ ఐఎస్‌పీ సంఘం అధ్యక్షుడు అన్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌లకు ఓ నియంత్రణ వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని బ్లూ వేల్‌ గేమ్‌ తెలియజేస్తోందని ముంబైకి చెందిన ఓ సైబర్‌ నిపుణుడు అన్నారు. భారత సంస్కృతికి, చట్టాలకు సరిపోయే ఆటలనే అనుమతించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement