సాక్షి, సూరత్ : పెద్దనోట్ల రద్దు, జీఎస్టీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. డిమానిటైజేషన్ నిర్ణయాన్ని వర్తమానం లేని క్రూసేడ్ మన్మోహన్ అభివర్ణించారు. అలాగే జీఎస్టీని కూడా ప్రభుత్వం ఏ మాత్రం ముందు చూపు లేకుండా అమలు చేసిందని మన్మోమన్ దుయ్యబట్టారు. డిమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలు.. ప్రధాని మోదీ అతిపెద్ద వైఫల్యాలని ఆయన మన్మోహన్ మాటల దాడి చేశారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుపై మోదీకి సొంత రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి మోదీ తీసుకున్న దుందుడుకు నిర్ణయాల వల్ల దేశంలో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. దీనికి మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి ఉంత మేలు జరిగిందో చెప్పలేం కానీ.. చైనాకు మాత్రం ఆర్థికంగా అతిపెద్ద వరంలా మారిందని మన్మోహన్ పేర్కొన్నారు. పెడ్డ నోట్ల రద్దుకు ముందు చైనా నుంచి 1.96 లక్షల కోట్ల దిగుమలు జరిగేవి.. డిమానిటైజేషన్ తరువాత అది 2.41 లక్షల కోట్లకు పెరిగిందని మన్మోహన్ వివరించారు. దేశంలో ఉద్యోగాల కల్పనకు అశనిపాతంగా మారడంతో పాటూ, ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడిందని మాజీ ప్రధాని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment