
పీ.రాజీవ్
న్యూఢిల్లీ: మందుల తయారీ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి కొన్ని రకాల మందుల ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తేయడం వల్ల సామాన్యులకు భారంగా మారిందని సీపీఎం లోక్‌సభలో ఆరోపించింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం 108 రకాల మందుల ధరల నియంత్రణ నుంచి వైదొలిగింది. దీంతో ఆయా మందుల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయని ఆ పార్టీ సభ్యుడు పీ.రాజీవ్ సభ దృష్టికి తీసుకొచ్చారు.
సామాన్యులు ఎక్కువగా వాడే టీబీ, ఎయిడ్స్, బీపీ, క్యాన్సర్, గుండె జబ్బులకు సంబంధించిన మందుల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయని సీపీఎం సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ జబ్బుకు వాడే గిల్‌వెక్ అనే మెడిసిన్ ధర రూ.8500ల నుంచి లక్షా 8 వేలకు పెరిగిందన్నారు. ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్య ప్రజలు ప్రాణాంతక జబ్బులు వచ్చినా మందులను కొనలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని రాజీవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
**