'కౌమ్ కె హీరే' సినిమాపై వివాదం | Controversy on Kaum Ke Heere | Sakshi
Sakshi News home page

'కౌమ్ కె హీరే' సినిమాపై వివాదం

Published Thu, Aug 21 2014 5:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'కౌమ్ కె హీరే' సినిమాపై వివాదం - Sakshi

'కౌమ్ కె హీరే' సినిమాపై వివాదం

ఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య ఆధారంగా పంజాబీలో నిర్మించిన 'కౌమ్ కె హీరే' (జాతి వజ్రాలు)అనే సినిమాపై వివాదం చెలరేగింది. రేపు విడుదల కానున్న ఈ సినిమాను నిషేధించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మీకాంత్ చావ్లా కేంద్ర హొం మంత్రికి ఒక లేఖ రాశారు. పంజాబ్లో మత సామరస్యం, శాంతి నెలకొల్పేందుకు ఈ సినిమా విడుదలను నిలిపివేయవలసిన అవసరం ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖపై స్పందించిన కేంద్రం 'కౌమ్ కె హీరే' సినిమాకు అనుమతి ఇచ్చే విషయం పరిశీలించాలని సమాచార మంత్రిత్వశాఖను ఆదేశించింది. పంజాబ్ యూత్ కాంగ్రెస్ కూడా ఈ సినిమాని నిషేధించమని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఈ సినిమా విడుదలైతే మతసామరస్యానికి విఘాతం కలుగుతుందని ఆ లేఖలో యూత్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement