
జీవోఎంకు నిర్మాణాత్మక సూచనలు చేయండి: దిగ్విజయ్‌సింగ్
రాష్ట్ర ప్రజలకు దిగ్విజయ్ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మంత్రుల బృందానికి(జీవోఎం) అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంత ప్రజలు నిర్మాణాత్మక సూచనలు, సలహాలు అందజేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సూచించారు. ప్రజలిచ్చే సూచనలు, సలహాలను మంత్రుల బృందం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. మంగళవారమిక్కడ ఆయన్ను విలేకరులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించగా ఆయన స్పందించారు. ‘ఇప్పటికే మంత్రుల బృందం వచ్చే నెల ఐదవతేదీ లోపు సూచనలు చేయమని అందర్నీ కోరింది. నేను సైతం విజ్ఞప్తి చేస్తున్నా. ఇరుప్రాంతాల ప్రజలు మంత్రుల బృందానికి నిర్మాణాత్మక సూచనలు చేయండి. బిల్లులో ఏవి చేరిస్తే మేలు జరుగుతుందని భావిస్తారో.. వాటన్నింటినీ మంత్రుల బృందానికి చెప్పండి’ అని దిగ్విజయ్ కోరారు.