'నేనిలాగే మాట్లాడతా..'
'నేనిలాగే మాట్లాడతా..'
Published Sat, Apr 16 2016 7:31 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
రానాఘాట్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ఈసీ పోలీసు అధికారులను బదిలీ చేయడం వల్ల తమ విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం చూపలేరని అన్నారు. నన్ను ఎవరైనా బెదిరించాలని చూస్తే గర్జిస్తానని అన్నారు. నేను ఇలాగే ఉంటాను. ఇలాగే మాట్లాడతానని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. బదిలీ చేసే పోలీసులంతా తమ మనుషులేనని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వ వ్యతిరేక సిండికేట్ ల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని అన్నారు. ఆక్రమంలోనే పోలీసులను బదిలీ చేస్తోందని ఆరోపించారు. తమ హయాంలోనే బెంగాల్ అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఎన్నికల ఘర్షణలో ఏడుగురు తృణమూల్ కార్యకర్తలు మరణించిన విషయాన్ని ప్రజలు మరిచిపోరని తెలిపారు. ప్రతిపక్ష సిండికేట్లకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. మే19న ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్షాలకు విచారమే మిగులుతుందన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తమపార్టీ క్రియాశీలక పాత్ర పోషించనుందని జోస్యం చెప్పారు.
Advertisement
Advertisement