భారతీయ నేవీకి ఎఫ్‌/ఏ-18 హార్నెట్‌ జెట్లు..! | Indian Navy In Talks With Boeing Over FA18 fighter jets | Sakshi
Sakshi News home page

భారతీయ నేవీకి ఎఫ్‌/ఏ-18 హార్నెట్‌ జెట్లు..!

Published Mon, Feb 5 2018 6:43 PM | Last Updated on Mon, Feb 5 2018 6:43 PM

Indian Navy In Talks With Boeing Over FA18 fighter jets - Sakshi

బోయింగ్‌ ఎప్‌/ఏ-18 హార్నెట్‌ ఫైటర్‌ జెట్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్‌/ఏ-18 హార్నెట్‌ జెట్లను భారత్‌కు అమ్మేందుకు విమాన తయారీ సంస్థ బోయింగ్‌ నేవీ అధికారులతో చర్చలు జరుపుతోంది. అయితే, సాంకేతిక అంశాలపై ఇంకా చర్చ జరగాల్సివుందని బోయింగ్‌ ఉపాధ్యక్షుడు సింగపూర్‌ ఎయిర్‌ షోలో పేర్కొన్నారు.

హార్నెట్‌ జెట్‌తో పాటు కేసీ-46 మల్టీరోల్‌ ట్యాంకర్‌ విమానాలను కూడా భారత్‌కు విక్రయించాలని భావిస్తున్నట్లు చెప్పారు. గతేడాది భారతీయ నేవీ 57 ఫైటర్‌ జెట్లు, భారతీయ వాయుసేన 100 ఫైటర్‌ జెట్ల కొనుగోలు ఆసక్తి చూపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బోయింగ్‌, సాబ్‌ ఏబీ జెట్ల తయారీ సంస్థలు భారత్‌కు ఫైటర్లను అమ్మేందుకు ఆసక్తిని చూపాయి. ఈ రెండు సంస్థలతో కొనుగోలు ఒప్పందం కుదిరితే ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఫైటర్‌ జెట్ల కొనుగోలు ఆర్డర్‌ అవుతుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement