ముంబై ఎయిర్ పోర్టు మూసివేత | Mumbai: Five-hour airport shutdown may hit evening flights | Sakshi
Sakshi News home page

ముంబై ఎయిర్ పోర్టు మూసివేత

Published Mon, Oct 31 2016 8:44 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

ముంబై ఎయిర్ పోర్టు మూసివేత

ముంబై ఎయిర్ పోర్టు మూసివేత

ముంబై: దేశ వాణిజ్య రాజధానిలోని విమానాశ్రయం నుంచి టికెట్ నుంచి బుక్ చేసుకున్నారా, ఈ రోజు ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారా.. అయితే మీ ప్రయాణం ఆలస్యం కావొచ్చు. ఎందుకంటే సోమవారం మధ్యాహ్నం నుంచి 5 గంటల పాటు విమానాశ్రయం మూసివేయనున్నారు. రన్ వే మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఎయిర్ పోర్టును మూసివేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని విమానయాన సంస్థలు, పైలట్లకు ముందుగానే తెలిపారు. ఈ షెడ్యూల్ కు అనుగుణంగా విమాన సర్వీసులు నడపాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కోరారు.

మూసివేత ప్రభావం సాయంత్రం విమాన రాకపోకలపై పడనుంది. ముంబై విమానాశ్రయం నుంచి 1600పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో ఎక్కువ దేశీయ సర్వీసులు. అయితే అక్టోబర్ 18న మొదలైన నిర్వహణ పనులు నవంబర్ చివరి వారంలో ముగుస్తాయని ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. ఈరోజు రన్ వే మూసివేస్తున్నందున విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని చెప్పారు.

Advertisement
Advertisement