'ఎవరినీ వదిలిపెట్టం'
పట్నా: చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ కుమార్ యాదవ్ నడిరోడ్డుపై హత్యకు పాల్పడిన ఉదంతంపై ఆయన స్పందించారు. ఈ ఘటనలో రాకీ కుమార్ బాడీగార్డును సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసినట్టు తెలిపారు. డిపార్ట్ మెంటల్ పరంగా ఇప్పటికే చర్య తీసుకున్నారని, అతడిపై క్రిమినల్ కేసు కూడా పెట్టనున్నారని చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని, దోషులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు.
తన కుమారుడు పోలీసుల ముందు లొంగిపోతాడని మనోరమా దేవి తెలిపారు. దోషిగా తేలితే అతడిపై చట్టంగా చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. కాగా, పరారీలో ఉన్న తన కుమారుడితో మాట్లాడలేదని రాకీ తండ్రి బిందీ యాదవ్ తెలిపారు. పోలీసులు తన ఫోన్ లాక్కున్నారని, తన కొడుకుతో ఎలా మాట్లాడగలనని ఆయన ప్రశ్నించారు.