ఆర్ధిక మంత్రి పదవి రేసులో లేను: దీపక్
ఆర్ధిక మంత్రి పదవి రేసులో తాను లేనని హెచ్ డీఎఫ్ సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఆర్ధిక మంత్రి పదవి రేసులో తాను లేనని హెచ్ డీఎఫ్ సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. తాను ఆర్ధిక మంత్రి పదవి చేపట్టనున్నట్టు వస్తున్న వార్తలన్ని రూమర్లేనని దీపక్ అన్నారు. అలాంటి వార్తల్లో వాస్తవం లేదన్నారు. అయితే ప్రభుత్వమేమైనా సహాయం కోరితే తాను స్పందించడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా అడిగిన ప్రశ్నకు దీపక్ సమాధానమిచ్చారు.
గత ఎనిమిది నెలల్లో ప్రస్తుత ఆర్ధిక మంత్రి చిదంబరం అందించిన సేవలు చిరస్మరణీయమని.. దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో రిజర్వు బ్యాంక్ చైర్మన్ రఘురామ్ రాజన్ నియామకం సాహసపూరితమైందన్నారు. మే 26న మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ లేదా సుబ్రమణ్యస్వామిలలో ఒకరికి ఆర్ధిక శాఖ కట్టబెట్టే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి.