న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనా అప్రూవర్‌గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఈడీ, సక్సేనాల తరఫు న్యాయవాదులు ఓ అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించాయి. సక్సేనా దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ అనంతరం ఇరువర్గాలు సక్సేనా అప్రూవర్‌గా మారే విషయమై ఉమ్మడి పిటిషన్ దాఖలు చేస్తాయన్నాయి. సక్సేనా న్యాయవాది గీతా లూథ్రా స్పందిస్తూ.. ఈడీ అధికారుల విచారణకు సక్సేనా అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉందనీ, 4 స్టెంట్లు వేశారని వెల్లడించారు. అంతేకాకుండా సక్సేనాకు లుకేమియా(రక్త కేన్సర్) ప్రాథమిక దశలో ఉందన్నారు. భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో అగస్టా హెలికాపర్ల కొనుగోలుకు ఒప్పందం కుదరింది. అయితే ఈ సందర్భంగా భారీగా ముడుపులు చేతులు మారినట్లు వార ్తలు రావడంతో కేంద్రం ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. సక్సేనా బెయిల్ పిటిషన్‌ను గురువా రం విచారిస్తామని ఢిల్లీలోని ఓ కోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment