మోడీ.. మరో వివాదం!
* పోలింగ్ రోజు వారణాసి ఓటర్లకు వీడియో సందేశం
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మరో వివాదానికి తెరతీశారు. తుది దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాను పోటీ చేస్తున్న వారణాసి సహా 41 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరుగుతుందనగా.. బీజేపీకి ఓట్లు వేయూలని విజ్ఞప్తి చేస్తూ మోడీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. మోడీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది. వారణాసి ‘గంగా-జమున’ సంస్కృతిని ప్రస్తావించిన మోడీ.. సోమవారం నాటి పోలింగ్‌లో ప్రజలు తమ ఓటు ద్వారా నగర ఐక్యత, సమగ్రతల స్ఫూర్తిని ప్రతిఫలింపజేయూలని కోరారు.
పవిత్ర నగర సమున్నత సంప్రదాయూన్ని సజీవంగా ఉంచాలన్నారు. తెలంగాణ, సీమాంధ్ర వంటి కొత్త రాష్ట్రాల ఏర్పాటును కూడా మోడీ ప్రస్తావించారు. ‘కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నారుు. అవి కొత్త రూపంలో పుట్టుకొస్తున్నారుు. కానీ వాటి విషయంలో చాలా స్వల్పంగా మాత్రమే చర్చలు జరిగారుు..’ అని అన్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సందేశాన్ని మోడీ ఆన్‌లైన్‌లో పెట్టారు. మోడీ సందేశం ప్రజాప్రాతి నిధ్య చట్టానికి, ఎన్నికల నిబంధనావళికి విరుద్ధమని కాంగ్రెస్ పేర్కొంది.