తెలంగాణ భవిష్యత్తు సుసంపన్నం కావాలి
న్యూఢిల్లీ: నూతన రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఆదివారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని, వారి జీవితాలు సుసంపన్నం కావాలని ఆయన ఆకాంక్షించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు మన్మోహన్ ఈ మేరకు ఓ సందేశం పంపారు.