ఒక కుటుంబం-ఐదు తరాలు | A family of five generations | Sakshi
Sakshi News home page

ఒక కుటుంబం-ఐదు తరాలు

Published Mon, Oct 20 2014 12:02 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఒక కుటుంబం-ఐదు తరాలు - Sakshi

ఒక కుటుంబం-ఐదు తరాలు

కుటుంబంలోని సభ్యులు తమ జీవిత కాలాన్ని సమాజానికే అంకితం చేశారంటే అది ఆశ్చర్యం కాదు. ఈ కుటుంబాన్ని చూశాక ఈ మట్టికున్న సేవాతత్పరత మనల్ని పులకింప చేస్తుంది.

ఒక కుటుంబంలోని సభ్యులు తమ జీవిత కాలాన్ని సమాజానికే అంకితం చేశారంటే అది ఆశ్చర్యం కాదు. ఈ కుటుంబాన్ని చూశాక ఈ మట్టికున్న సేవాతత్పరత మనల్ని పులకింప చేస్తుంది. ఇలాంటి అన్నదమ్ములనే ఇవ్వమని పీడితులు, తాడితులు కాలాన్ని కోరుకుంటారు.
 
ఒక కుటుంబం ఒకే వృ త్తిలో కొనసాగటం చూ స్తూ వస్తున్నాం. కొన్ని కుటుంబాలు నేటికీ తరతరాలుగా తమ తమ వృత్తులలో కొనసాగడాన్నీ చూస్తున్నాం. వృత్తులు మారితే జీవితాలు మారిన వారినీ చూస్తున్నాం. ఏ పని చేసినా ఏ వృత్తి చేప ట్టినా సామాజిక చింతనను ఆదర్శంగా పెట్టుకుని జీవించేవాళ్ల సంఖ్య కూడా ఇదే సమాజంలో మరో పక్క ఉంది. అది ఎక్కువగా ఉందా తక్కువగా ఉం దా అన్నది వేరే విషయం. కాలాన్ని బట్టి, మార్పు లను బట్టి మారే మనుషులను అనేకమందిని సమా జం చూస్తూనే ఉంది. సామాజిక స్పృహ ఉన్నవాళ్లు కాలాలు మారినా, సమాజాలు మారినా ప్రజల పక్షం వహించి నిలబడతారు. ఇలా జనపక్షం వహిం చి నిలబడటం అన్న సంస్కృతి తెలుగు నేలలో చూ స్తూ వస్తున్నాం. రాజకీయంగా, సైద్ధాంతికంగా భిన్న భావనలు ఉండవచ్చును. కానీ మనం పనిచే యాల్సింది మాత్రం జనహితం కోసమే అన్న సూ త్రాన్ని పట్టుకుని ఎందరెందరో పనిచేశారు. ప్రాణ త్యాగాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి అంటే నా చిన్ననాటి నుంచి ఇలాంటి వారిని ఎందరినో చూస్తూ వచ్చాను. వాళ్లు త్యాగాలు చేసి చూపిన దారులు మాకు విలువలుగా మారా యి. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది నేలకొరిగారు. వీళ్ల త్యాగాలతో తిరగ బడ్డ తెలంగాణ చరిత్రను సృష్టించారు. సామాజిక మా ర్పును మాత్రమే వాళ్లు కోరుకున్నారు తప్ప తమ వ్యక్తిగత ప్రయోజనాలను ఎన్నడూ ఆశించలేదు.

మా వరంగల్ జిల్లాలో ఎందరెందరో జీవి తాలు మమ్మల్ని  ప్రభావితం చేశాయి. కొన్ని కుటుం బాలు నేటికీ అదే సామాజిక చింతనలో నిలిచే ఉన్నాయి. అందుకు సజీవ తార్కాణంగా పెండ్యాల రామానుజరావు కుటుంబం కనిపిస్తుంది. ఒక కుటుంబంలోని ఐదుగురు అన్నదమ్ములు తమ జీవి తాంతం సామాజిక మార్పు కోసం నిలబడ్డారు. అదే దారిలో కలం పట్టి రాశారు. ఆ కుటుంబంలో మొద టివాడు పెండ్యాల రామానుజరావు (1919- 1950). ఈ కుటుంబంలో మొత్తం సంతానం 10 మంది. ఇందులో ఐదుగురు అన్నదమ్ములు, ఐదు గురు అక్కాచెల్లెళ్లు. వరవరరావు అందరికన్నా చిన్న వాడు. రామానుజరావుకు వరవరరావుకు మధ్య 21 ఏళ్ల తేడా ఉంది. ఆ కుటుంబంలో వరవరరావు 10వ సంతానం. దేశానికి సాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ 13వ సంతానం. గాంధీకి వరవరరావుకు పోలికలేదు. అది వేరే విషయం.

ఒక కుటుంబంలో ధారగా వచ్చిన సామాజిక దృక్పథాన్ని పరిశీలిస్తే అది ఐదు తరాల చైతన్యంగా కనిపిస్తుంది. ఈ కుటుంబంలో కాంగ్రెస్ వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వం ఇటీవల నిషేధించిన ఆర్‌డీఎఫ్ అధ్యక్షుడు ఉన్నాడు. ఆనాటి కాంగ్రెస్ వాలంటీర్లు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని నిజాయితీగా నిలబడ్డ వారు. మాడపాటి హనుమంతరావు, రావి నారాయణరెడ్డిలకు పొంతన లేకపోయినప్పటికినీ పీవీ నరసింహారావు రాసిన ‘గొల్లరామవ్వ’ కథలో కాంగ్రెస్ వాలంటీర్ల నిజాయితీ తెలుస్తుంది. పెం డ్యాల రామానుజరావు 1919లో జన్మించాడు. 1950లో మరణించాడు. ఆయన హయగ్రీవాచారికి గురువు. 31 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఆయనకు 20 ఏళ్లు వచ్చాక కాంగ్రెస్ వాలంటీర్‌గా చిత్తశుద్ధితో పనిచేశాడు. రెండవ వ్యక్తి పెండ్యాల శేషగిరిరావు (1923-2014). ఈయన కూడా నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. అరెస్టు అయ్యా డు. జైలుకు పోయాడు. ఈయన కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాడు. పోస్టు మాస్టర్‌గా పనిచేశాడు. కథలు రాశాడు. 1943లో ‘దాంపత్యం’ అన్న కథల సంకల నం తెచ్చాడు. (‘సాహితీ మిత్రమండలి’ అన్న ప్రచు రణ సంస్థను నెలకొల్పాడు.) పొట్లపల్లి రామారావు రాసిన తొలికథల పుస్తకం ఈయనే ప్రచురించాడు. 1944లో 20 మంది వరంగల్ జిల్లాకు చెందిన రచ యితలు రాసిన కథలను ‘సేవాంజలి’ పేరున అచ్చు వేశాడు. మూడవ వ్యక్తి చిన రాఘవరావు. ఈయన (1930-1977) హైస్కూల్ టీచర్‌గా పనిచేశాడు. 1940లో వట్టికోట ఆళ్వారుస్వామి సంకలనం చేసిన ‘పరిసరాలు’ కథా సంపుటిలో ఈయన కథ రాశాడు. రాజశ్రీ పేరుతో కవిత్వం రాశాడు. నాలుగో వ్యక్తి పెండ్యాల దామోదరరావు. ఈయన ప్రాథమిక పాఠ శాలలో టీచర్‌గా పనిచేశాడు. చాలా కాలం పెం డ్యాల గ్రామంలోనే పనిచేశాడు. ఈయన కూడా కవి త్వం రాశాడు.

సమాజంలో కన్నీళ్లను, కష్టాలను చూసిన ఈ ఐదుగురు అన్నదమ్ములు పోతన లాగా ఆత్మగౌర వంతో నిలిచి ప్రజల పక్షం నిలిచినవారు. వీళ్లు ఏనా డూ గుర్తింపు కోసం పాకులాడలేదు. వీళ్లు చేసిన పనల్లా ప్రజల కోసం నిలబడి కష్టాలు పడ్డారు. జైళ్ల కు పోయి వచ్చారు. వీళ్లు జైలు జీవి తాలను అను భవిస్తూ ప్రజల బాధల సంకెళ్లు తెంచాలని చూసిన వారు. చివరకు ఈ కుటుంబానికున్న సామా జిక చింతన ఎక్కడిదాకా వచ్చిందంటే చివరకు వరవర రావును వరంగల్ నుంచి పాలకులు నగర బహిష్క రణ చేసే దాకా వచ్చింది. ప్రజలను కష్టాల నుంచి బైటపడేయటమే కేంద్ర బిందువుగా రచనలు చేస్తూ, ప్రజల పక్షం నిలబడ్డవారు ఈ అన్నద మ్ములు. ఇలాంటి కుటుంబాలు ఊరికొక్కటి ఉంటే చాలు ఆ ఊరు కన్నీళ్ల నుంచి బయటప డుతుంది. ఇలాంటి అన్నదమ్ముల కోసం కుటుం బమే కాదు సమాజమే ఎదురుచూస్తుంది. ఎవరి సౌఖ్యం కోసం వారు సం పాదించుకుని తమ జీవిత అరల్లో బతకటం కాకుం డా తోటివాళ్ల గురించి ఆలోచించటం ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ఆదర్శాలను అందిపుచ్చుకోకపోతే సమాజాలకు బాధలు తప్పవు.

 (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త సామాజిక విశ్లేషకులు)  చుక్కా రామయ్య
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement