గ్రహం అనుగ్రహం, ఆదివారం 25, జనవరి 2015 | Anugraham of the day on Jan 25, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, ఆదివారం 25, జనవరి 2015

Published Sun, Jan 25 2015 1:21 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

Anugraham of the day on Jan 25, 2015

శ్రీజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం; తిథి శు.పంచమి ఉ.8.33 వరకు
తదుపరి షష్ఠి; నక్షత్రం ఉత్తరాభాద్ర సా.6.50 వరకు
 తదుపరి రేవతి; వర్జ్యం ఉ.5.22 నుంచి 6.49 వరకు;
దుర్ముహూర్తం సా.4.19 నుంచి 5.03 వరకు;
అమృతఘడియలు ప.2.20 నుంచి 3.50 వరకు
 సూర్యోదయం: 6.38;
 సూర్యాస్తమయం: 5.47
 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
 యమగండం: ఉ.12.30 నుంచి 1.30 వరకు

భవిష్యం
 
మేషం
: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
 
వృషభం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 
మిథునం: ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 
సింహం: దూరప్రయాణాలు. ఆలోచనలు కలిసిరావు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.
 
కన్య: బంధువులతో ఉత్సాహంగా గడుపు తారు. మీ కృషి ఫలిస్తుంది. పనుల్లో పురోగతి. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
 
తుల: అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వ్యవహారాలలో విజయం. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
 
వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
 
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.
 
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
కుంభం: పనుల్లో ఆటంకాలు. వ్యయ ప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. ఆలయాలు సందర్శి స్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
 
మీనం: చిన్ననాటి మిత్రులను కలుసుకుం టారు. విద్యార్థులకు కొత్త ఆశలు. పనుల్లో పురో గతి. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

- సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement