ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం దృశ్యాలు
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు కూడా జరగడంతో అది పూర్తిగా మునిగిపోయింది.
అందులో ఉన్న 18 మంది సిబ్బంది పరిస్థితి ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదానికి గురైన జలాంతర్గామి దాదాపు మునిగిపోగా.. కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది.
జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది.