
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడి ప్రభ్వుతం మరో హామీని నెరవేర్చింది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు లక్షలలోపు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతు రుణమాఫీ ప్రకటనపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా రైతు రుణమాఫీని ప్రకటించాలని ప్రతిపక్ష బీజేపీ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయని, రుణమాఫీ ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని బీజేపీపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో అన్నారు. ప్రతిపక్ష, రైతుల డిమాడ్లకు తలొగ్గని ఉద్ధవ్ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రవేశపెట్టింది.