
సాక్షి, విజయవాడ: స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని బుధవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ గౌరవం తగ్గించేలా మాట్లాడిన నారా లోకేష్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలన్నారు. నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవారలు జరుగుతాయని తెలిపారు. ఇసుకను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలు, కొంగ జపాలని దుయ్యబట్టారు. రాజకీయాల్లో లంబు, జంబులు టీడీపీ, జనసేనలంటూ విమర్శించారు. అందరికీ సంక్షేమ పథకాలు అందిచాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని తెలిపారు. ఆదర్శమైన ఇసుక విధానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారని మల్లాది విష్ణు పేర్కొన్నారు.