సాక్షి, విజయవాడ : తెలుగువారికి అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పడుగను చంద్రబాబు రాజకీయాలకు వాడుకోవడం దౌర్భాగ్యమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తమ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూడలేక బాబు రగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై భోగి మంటలు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. ఈ ఏడాది అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలే దీనికి నిదర్శనమన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం కనిపిస్తోందని తెలిపారు.
గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ సంక్రాంతి శోభ ఉట్టిపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం అమరావతి ముసుగులో అభూత కల్పనలతో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పండుగ జరుపు కోవద్దని పిలుపునిచ్చే బాబులాంటి నాయకుడ్ని తానెక్కడా చూడదలేదన్నారు. చంద్రబాబు ఒక మాట మీద నిలడలేని వ్యక్తి అని మరోసారి రుజువైందని వెల్లంపల్లి చెప్పారు. సంక్రాంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment