హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్(ఈవీఎం)లపై అనేక అనుమానాలను లేవనెత్తారు. ఒక నియోజకవర్గంలో ఒకే ఈవీఎం మెషీన్‌ను చెక్ చేసే క‍్రమంలో వారు సూచించిన మెషీన్‌ను మాత్రమే చెక్ చేయడానికి అనుమతి ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మంగళవారం ఎన్నికల ఫలితాలపై దాదాపు స్పష్టత వచ్చిన తర్వాత మీడియా మాట్లాడిన ఉత్తమ్.. సుమారు 450 ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థికి సంబంధించి ఓట్లను తిరిగి లెక్కించమంటే అందుకు ఎన్నికల కమిషన్ విముఖత వ్యక్తం చేస్తుందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్‌పై అనుమానం ఉంది. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. 450 ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థికి రీకౌంటింగ్ చేయమంటే చేయడం లేదు. ఎలక్షన్ కమిషన్ కేసీఆర్‌తో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని అనాల్సి వస్తుంది. వీవీప్యాట్ ఆధారంగా లెక్కించిమంటే మళ్లీ మెషీన్లపై లెక్కించి అభ్యర్థుల్ని డిక్లేర్ చేశారు. మళ్లీ ఒకసారి వీవీప్యాట్స్ ట్రయల్స్ లెక్కచేయాలి. ఇదే మా డిమాండ్. లేకపోతే ఇది బ్లాక్ డేగా మిగిలిపోతుంది. మేము అడిగిన ఈవీఎమ్ మెషీన్ చెక్ చేయకుండా.. వారి సూచించిన మెషీన్‌నే చెక్ చేశారు. మేము ఇంత అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు వీవీప్యాట్ ట్రయల్స్‌ను లెక్కించడం లేదు. అలా లెక్కించనప్పుడు వీవీప్యాట్ ట్రయల్స్ ఎందుకున్నట్లు. మేము ఓట వేసిన దానికి అందులో ఉండేదానికి ఒకే విధంగా ఉందని ఎలా నమ్మాలి. పేపర్ ట్రయల్స్ లెక్కచేయమని అడిగితే మీరు అందుకు సిద్ధంగా లేరు. పలుచోట్ల కౌంటింగ్ జరిగిన తీరుకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన లెక్కకు వ్యత్యాసం కనబడింది. దాంతో ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా ఓటింగ్ నిలిపివేయడం జరిగింది. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment