
సాక్షి, నెల్లూరు : ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మండి పడ్డారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. అందుకే వైఎస్సార్ సీపీ పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. మహిళలను మరోసారి మోసం చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు పెన్షన్ మొత్తాన్ని పెంచుతానని చెప్పారు.. కానీ ఇది ఎన్నికల వరకూ మాత్రమే అమల్లో ఉంటుందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే.. టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పే బాబు.. 40 ఏళ్ల వయసున్న జగన్ మోహన్ రెడ్డిని కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment