కరాచీ: ఇప్పటివరకూ వరల్డ్ క్రికెట్‌లో చోకర్స్ పేరు ఎవరికి సరిపోతుందంటే ఠక్కున వినిపించే పేరు దక్షిణాఫ్రికా. మెగా టోర్నీలతో పాటు కీలక మ్యాచ్‌ల్లో గెలుపు అంచుల వరకూ వచ్చి దక్షిణాఫ్రికా చతికిలబడిన సందర్భాలు ఎన్నో. జట్టుగా పటిష్టంగా ఉన్నప్పటికీ ఒత్తిడిని అధిగమించలేక గెలిచే మ్యాచ్‌లను చేజార్చుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవడంతో సఫారీలకు చోకర్స్‌గా ముద్రపడింది. అయితే ఇప్పుడు కొత్త చోకర్స్ వచ్చినట్లే కనబడుతోందంటూ న్యూజిలాండ్ ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నిప్పులు చెరిగాడు. మిండియాతో వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లను కివీస్ టై చేసుకోవడంపై మండిపడ్డాడు.
గెలవాల్సిన మ్యాచ్‌లను టై చేసుకోవడం, ఆపై సూపర్ ఓవర్‌లో ఓడిపోవడం కివీస్‌కు పరిపాటిగా మారిపోయిందని విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ.. ‘ మీరు ఏమైనా కొత్త చోకర్సా?.. అసలు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఆరు సూపర్ మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచారంటే న్యూజిలాండ్ జట్టును ఏమనాలి. వారు పరాజయాల్ని చవిచూడటంలో స్పెషలిస్టులా ఉన్నారు. మీరు ఒక మంచి జట్టు అయితే 166 పరుగుల టార్గెట్‌ను ఎందుకు ఛేదించలేకపోయారు. అది సునాయాసమైన టార్గెట్. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయారు. ఒత్తిడిని అధిగమించలేకపోయారు. కొత్త చోకర్స్‌గా అవతరించారా.. కఠిన పరిస్థితుల్లో చతకిలబడే మరో దక్షిణాఫ్రికా జట్టు తరహాలో కనిపిస్తున్నారు’ అని ఎద్దేవా చేశాడు.(ఇక్కడ చదవండి: మనీష్ పాండే డబుల్ హ్యాట్రిక్)
టీమిండియాతో జరిగిన వరుస రెండు టీ20లను దక్షిణాఫ్రికా తొలుత టై చేసుకోవడం, ఆపై సూపర్ ఓవర్‌లో ఓడిపోవడంతో అక్తర్ ప్రశ్నలు గుప్పించాడు. నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయానికి 7 పరుగుల అవసరమైన తరుణంలో నాలుగు వికెట్లు(రెండు రనౌట్లు) కోల్పోయి టైగా ముగించింది. అటు తర్వాత సూపర్ ఓవర్‌లో 14 పరుగుల టార్గెట్‌ను కివీస్ నిర్దేశించగా, దాన్ని బంతి మిగిలి ఉండగా టీమిండియా ఛేదించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ తొలి రెండు బంతుల్ని వరుసగా సిక్స్, ఫోర్‌గా కొట్టగా, మూడో బంతికి ఔటయ్యాడు. నాల్గో బంతికి రెండు పరుగులు తీసిన కోహ్లి, ఐదో బంతికి ఫోర్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. (ఇక్కడ చదవండి: ‘సూపర్’ సీక్వెల్)
Comments
Please login to add a commentAdd a comment