వరల్డ్ టీ 20లో భాగంగా న్యూజిలాండ్తో బుధవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ:వరల్డ్ టీ 20లో భాగంగా బుధవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో వరుస విజయాలు సాధించి న్యూజిలాండ్ మంచి ఊపు మీద ఉండగా, మరోవైపు తడబడుతూ ఇంగ్లండ్ సెమీస్ కు చేరింది.పొట్టి ఫార్మాట్ లో ఒకసారి వరల్డ్ కప్ ను గెలిచిన ఇంగ్లండ్ మరొకసారి తుదిపోరుకు అర్హత సాధించాలని భావిస్తుండగా, న్యూజిలాండ్ మాత్రం తొలిసారి ఫైనల్ కు చేరాలని పట్టుదలగా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.
ఇప్పటివరకూ ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇంగ్లండ్ 8 గెలిచి, నాలుగు ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లలో మాత్రం నాలుగు మ్యాచ్‌లు జరిగితే చెరో రెండు గెలిచాయి.