విజృంభించిన ప్రవీత్, చాంద్‌పాషా | Great performance by Pravith,chandpasha | Sakshi
Sakshi News home page

విజృంభించిన ప్రవీత్, చాంద్‌పాషా

Published Fri, Oct 4 2013 11:50 PM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

Great performance by Pravith,chandpasha

జింఖానా, న్యూస్‌లైన్: ఎస్‌ఏ అంబర్‌పేట్ బౌలర్స్ ప్రవీత్ (4/43), చాంద్‌పాషా (4/15) విజృంభించారు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఏ అంబర్ పేట్ జట్టు 67 పరుగుల తేడాతో టీమ్ స్పీడ్ జట్టుపై విజయం సాధించింది. మొదట అంబర్‌పేట్ 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రాకేష్ 35, రవి 36 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు.
 
  టీమ్ స్పీడ్ బౌలర్స్ వెంకటేశ్ 4, ఆదిత్య 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం టీమ్ స్పీడ్ జట్టు 162 పరుగులకే కుప్పకూలింది. సంతోష్ (60) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో మ్యాచ్‌లో ఉస్మానియా జట్టు 7 వికెట్ల తేడాతో అవర్స్ జట్టుపై గెలుపొందింది. తొలుత అవర్స్ జట్టు 192 పరుగులు చేసింది. తర్వాత ఉస్మానియా మూడు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.  
 
 మరో మ్యాచ్ స్కోర్లు:  నిజాం కాలేజి: 106 (సాయికీర్త్ 4/69, వంశీ రెడ్డి 5/6); విశాఖ: 107/1 (సాయి కీర్త్ 68 నాటౌట్).
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement