రైల్వే టీసీగా మత్స సంతోషి | matsa santoshi as railway TC | Sakshi
Sakshi News home page

రైల్వే టీసీగా మత్స సంతోషి

Published Mon, Nov 3 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

రైల్వే టీసీగా మత్స సంతోషి

రైల్వే టీసీగా మత్స సంతోషి

విజయనగరం మున్సిపాలిటీ: అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషికి ఉద్యోగం లభించింది. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన సంతోషి ప్రతిభను గుర్తించిన రైల్వే శాఖ ఆమెకు ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద సీనియర్ టీసీగా ఉద్యోగం కేటాయించింది. సంతోషికి జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలోనే పోస్టింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన తరువాత సంతోషి ప్రతిభను గుర్తించిన రైల్వేశాఖ అధికారులు ఆమె  దరఖాస్తును తెప్పించుకుని నేరుగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినట్లు సంతోషి కోచ్ చల్లా రాము తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement