ఎంఎస్ ధోని
సెంచూరియన్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరో అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 క్యాచ్‌లు పట్టిన మూడో వికెట్ కీపర్‌గా ధోని ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతో చివరిదైన ఆరో వన్డేలో ఆమ్లా క్యాచ్ పట్టడం ద్వారా ధోని ఈ మార్కును చేరాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్ కీపింగ్ క్యాచ్‌ల్లో భాగస్వామ్యమైన తొలి భారత కీపర్‌గా ధోని నిలిచాడు. 494 మ్యాచ్‌ల్లో 564 ఇన్నింగ్స్‌ల్లో ఆరొందల కీపర్ క్యాచ్‌లను ధోని పట్టాడు. ఓవరాల్‌గా వికెట్ కీపర్‌గా అత్యధిక వికెట్లు పట్టిన జాబితాలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో మార్క్ బౌచర్(952-దక్షిణాఫ్రికా) ఉండగా, ఆడమ్ గిల్‌క్రిస్ట్(813-ఆస్ట్రేలియా) రెండో స్థానంలో ఉన్నాడు. 494 మ్యాచ్‌ల్లో 564 ఇన్నింగ్స్‌ల్లో ధోని ఆరొందల క్యాచ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 256, వన్డేల్లో 297, టి20ల్లో 47 క్యాచ్‌లను ధోని పట్టాడు.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మూడొందల వన్డే వికెట్ కీపింగ్ క్యాచ్‌ల ఘనతను ధోని సొంతం చేసుకుంటాడని భావించినా, మూడు క్యాచ్‌ల దూరంలో నిలిచిపోయాడు. మరొకవైపు వన్డేల్లో పదివేల పరుగుల మార్కును చేరడానికి ధోని 33 పరుగుల దూరంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment