
సిడ్నీ: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే దిశగా ఆ్రస్టేలియా పయనిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయన్ (5/68) తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేయడంతో... న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటైంది. అతనికి ప్యాట్ కమిన్స్ (3/44) చక్కటి సహకారం అందించాడు. అరంగేట్రం బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిఫ్స్ (52; 6 ఫోర్లు, సిక్స్) టెస్టుల్లో తొలి ఆర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 203 పరుగుల ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా జట్టుకు న్యూజిలాండ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. వార్నర్ (23 బ్యాటింగ్; ఫోరు), బర్న్స్ (16 బ్యాటింగ్; 2 ఫోర్లు) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని ఆసీస్ ప్రస్తుతం 243 పరుగుల ఆధిక్యంలో ఉంది.