
హామిల్టన్: పర్యాటక జట్టు వెస్టిండీస్‌కు ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో మరో పరాభవం ఎదురైంది. వరుసగా రెండో టెస్టులోనూ విండీస్ ఓటమి పాలు కావడంతో రెండు టెస్టుల సిరీస్‌ను కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ సేన 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన విండీస్ 203 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆతిథ్య కివీస్ 240 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఓవర్ నైట్ స్కోరు 30/2తో నాలుగో రోజు బ్యాటింగ్ చేసిన విండీస్.. రోస్టన్ ఛేజ్ (98 బంతుల్లో 64) హాఫ్ సెంచరీ చేయగా, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు రీఫర్(29), రోచ్ (32) తమ వంతుగా స్కోరు బోర్డుకు పరుగులు జోడించకుంటే ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 200 మార్కు కూడా చేరకపోయేది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 6 వికెట్లు పడగొట్టగా, వాగ్నర్ 5, సౌథీ 4 వికెట్లు తీశారు. అంతకుముందు తమ రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో నిలిచిన కివీస్ టపార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ (107 నాటౌట్; 11 ఫోర్లు)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. కెరీర్‌లో 17వ టెస్టు శతకం సాధించిన రాస్ టేలర్... తన ఆరాధ్య ఆటగాడు, కివీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ మార్టిన్ క్రో రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment