న్యూఢిల్లీ:పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్‌పై టీమిండియా వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్.. ప్రశంసలు కురిపించాడు. పాక్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన ముస్తాక్ ఒంటి చేత్తో ఆ దేశానికి ఎన్నో విజయాలు అందించాడన్నాడు. రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో ముస్తాక్ గురించి అభిప్రాయం చెప్పమని కోరగా భజ్జీ స్పందించాడు. తొలుత గ్రేట్ ఆఫ్ స్పిన్నర్లు గురించి ఎదురైన ప్రశ్నకు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ మురళీధరన్ పేరును హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. (ఆన్‌లైన్ పాఠాల్లో అశ్లీల చిత్రాల కలకలం..!)
ఆ తర్వాత వరుసలో నాథన్ లయాన్, గ్రేమ్ స్వాన్ పేర్లను భజ్జీ సూచించాడు. ఈ క్రమంలోనే ముస్తాక్ ప్రస్తావనను రోహిత్ తీసుకురాగా అందుకు భజ్జీ సమాధానమిచ్చాడు. ‘ ముస్తాక్ ఒక గ్రేట్ ఆఫ్ స్పిన్నర్. ఒక క్లాస్ బౌలర్. అతని నుంచి వచ్చే దూస్రాను ఎవరూ ఆడాలనే అనుకోరు. అతనొక నిజమైన మ్యాచ్ విన్నర్. దూస్రాను కనిపెట్టిందే ముస్తాక్. ప్రధానంగా వన్డేల్లో 45 నుంచి 50 ఓవర్ల మధ్యలో ముస్తాక్ బౌలింగ్ చాలా ప్రమాదకరం. ఆ సమయంలో ముస్తాక్‌ను ఎటాక్ చేయడం కష్టంగా ఉండేది. ఆ ఓవర్ల మధ్యలోనే మ్యాచ్‌ను ముస్తాక్ మలుపు తిప్పి పాకిస్తాన్‌కు విజయాలను అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక భారత ఆఫ్ స్పిన్నర్ల విషయానికొస్తే ప్రస్తుతం రవి చంద్రన్ అశ్విన్ అని పేర్కొన్నాడు. ఈ వరుసలో చాలా మంది భారత స్పిన్నర్లు ఉన్నారని, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తీసుకున్న అక్షయ్ వాఖేరే ఒక మంచి స్పిన్నర్‌గా ఎదుగుతాడన్నాడు. అతను భారత్ బౌలింగ్ ఆశాకిరణం కావొచ్చన్నాడు. (నాతో తప్పుగా ప్రవర్తిస్తావా అన్నాడు ..!)
Comments
Please login to add a commentAdd a comment