ముంబై: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లో జోరు తగ్గలేదు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని చాలా కాలమే అయినా బ్యాట్ పట్టుకుంటే మాత్రం దూకుడును ప్రదర్శిస్తున్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా లెజెండ్స్-వెస్టిండీస్ లెజెండ్స్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ వీర విహారం చేశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లతో అజేయంగా 74 పరుగులు చేశాడు. అటు సచిన్ 29 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 83 పరుగులు సాధించి ఇండియా లెజెండ్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ లెజెండ్స్ 8 వికెట్లకు 150 పరుగులు చేసింది. చందర్‌పాల్ (61) అర్ధసెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఇండియా లెజెండ్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసి నెగ్గింది. సెహ్వాగ్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచాడు.
సచిన్ నామస్మరణతో మార్మోగిన స్టేడియం
సచిన్ టెండూల్కర్ -సెహ్వాగ్‌లు ఓపెనింగ్‌కు వస్తున్న సమయంలో వాంఖేడే స్టేడియం మార్మోగింది. సచిన్.. సచిన్ అంటూ ప్రేక్షకుల నుంచి విశేష మద్దతు లభించింది. ఒకప్పుడు సచిన్‌కు ఎంతటి క్రేజ్ ఉండేదో అదే తరహాలో అభిమానుల నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భాగంగా చివరిసారి ఇదే స్టేడియంలో ఆడిన సచిన్.. దాదాపు 9 ఏళ్ల తర్వాత అదే స్టేడియంలో తొలిసారి ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment