హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 118 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో కుమ్మేసిన సన్‌రైజర్స్..ఆపై ఆర‍్సీబీని 113 పరుగులకే కట్టడి చేసి ఘన విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. ఆర్సీబీ ఆటగాళ్లలో పార్థివ్ పటేల్(11), హెట్‌మెయిర్(9), విరాట్ కోహ్లి(3), ఏబీ డివిలియర్స్(1), మొయిన్ అలీ(2), శివం దూబే(5)లు తీవ్రంగా నిరాశపరిచారు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్‌కు చేరడంతో ఆర్సీబీ 35 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో గ్రాండ్ హోమ్(37), ప్రయాస్ రే బర్మన్(19)లు ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 51 పరుగులు జత చేయడంతో ఆర్సీబీ కాస్త కుదుటపడింది. ప‍్రయాస్ రే ఔట్ అయిన తర్వాత ఉమేశ్ యాదవ్(14), చహల్(1)లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో ఆర్సీబీ 19.5 ఓవర్లలో ఆలౌటైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగుల స్కోరు సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు అత్యుత్తమ స్కోరు. బెయిర్ స్టో(114; 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(100 నాటౌట్: 55 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు)లు రెచ్చిపోయి ఆడటంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్ చేసి ఘోర ఓటమి చవిచూసింది. ఇది సన్‌రైజర్స్‌కు రెండో విజయం కాగా, ఆర్సీబీకి మూడో ఓటమి.
Comments
Please login to add a commentAdd a comment