
నాకౌట్‌కు కొలంబియా !
ప్రపంచకప్ గ్రూప్ ‘సి’లో కొలంబియా నాకౌట్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. గురువారం రాత్రి బ్రెజిలియాలో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో ఐవరీ కోస్ట్‌పై విజయం సాధించింది.
2-1తో ఐవరీకోస్ట్‌పై గెలుపు
బ్రెజిలియా: ప్రపంచకప్ గ్రూప్ ‘సి’లో కొలంబియా నాకౌట్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. గురువారం రాత్రి బ్రెజిలియాలో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో ఐవరీ కోస్ట్‌పై విజయం సాధించింది. కొలంబియా ఆటగాళ్లు రోడ్రిగ్వెజ్, క్వింటెరో చెరో గోల్ కొట్టగా... ఐవరీ కోస్ట్ తరఫున గెర్వినో ఏకైక గోల్ సాధించాడు. ఈ విజయంతో కొలంబియా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచింది. గోల్స్‌లో ఆధిక్యం బాగున్నందున... ఏదైనా అనూహ్య ఫలితాలు వస్తే తప్ప ఈ గ్రూప్ నుంచి కొలంబియా నాకౌట్‌కు చేరడం ఖాయం.
1. తొలి మ్యాచ్‌లో గ్రీస్‌పై విజయంతో ఆత్మవిశ్వాసాన్ని సాధించిన కొలంబియా అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది. ఐవరీ కోస్ట్ కూడా ఏ మాత్రం తక్కువ తినలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఆడింది. ఇరు జట్లకు పలుసార్లు గోల్స్ అవకాశాలు వచ్చినా అవి సఫలం కాలేదు. దీంతో గోల్ నమోదు కాకుండానే తొలి అర్ధభాగం ముగిసింది. మొత్తానికి బంతిని అధికశాతం తమ ఆధీనంలోనే ఉంచుకున్న ఐవరీ.. ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.
2. ద్వితీయార్ధంలో కొలంబియా జోరు పెంచింది. ఐవరీ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. ఆ జట్టు చేసిన ప్రయత్నాలు 64వ నిమిషంలో ఫలించాయి. క్వాడ్రడో ఇచ్చిన కార్నర్ కిక్‌ను జేమ్స్ రోడ్రిగ్వెజ్ హెడర్‌తో గోల్ సాధించాడు. మరో ఆరు నిమిషాలకు క్వింటెరో మరో గోల్ కొట్టి కొలంబియా శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు.
3. 73వ నిమిషంలో ఐవరీ ఫార్వర్డ్ గెర్వినో... కొలంబియా డిఫెండర్లను బోల్తా కొట్టించి తొలి గోల్ అందించాడు. దీంతో కొలంబియా ఆధిక్యం 2-1కి తగ్గింది. ఆ తర్వాత ఐవరీ మరింత పోరాడినా ఓటమి తప్పలేదు.
స్కోరు బోర్డు
కొలంబియా : 2
రోడ్రిగ్వెజ్ : 64వ ని.
క్వింటెరో : 70వ ని.
ఐవరీ కోస్ట్ : 1
గెర్వినో : 73వ ని.