రోసీయూ: ఆస్ట్రేలియాతో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ కుప్పకూలింది. కడపటి వార్తలందేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. షై హోప్ (36)దే అత్యధిక స్కోరు. బ్రాత్‌వైట్ (10), డారెన్ బ్రేవో (19), శామ్యూల్స్ (7), బ్లాక్‌వుడ్ (2), రామ్‌దిన్ (19) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కగా, జాన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ద్వారా ఆడమ్ వోజెస్ (ఆసీస్), షేన్ డౌరిచ్ (విండీస్) టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.