ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామును రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఒంగోలు : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామును రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి... బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి పోరుమామిళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.