న్యూఢిల్లీ: సాధారణ ప్రజల సమస్యలకు చేరువైయ్యేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సాధారణ ప్రజల దృష్టిని ఆకట్టుకొని ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు ఎఫ్‌ఎం ఎన్నికల సరళిలో మరికొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. వారి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను వివరిస్తూ ఎఫ్‌ఎం రేడియోల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హల్‌చల్ చేస్తున్నారు. ‘నమస్కార్ మై హూ అరవింద్ కేజ్రీవాల్’ అంటూ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. అయితే ఈ విషయమై ప్రజలు ఇప్పటికే విసిగెత్తినట్లు గమనించిన ఆప్ నేతలు సరికొత్త ప్రచారానికి నడుం బిగించారు. ప్రచార వ్యూహాన్ని మార్పుకొన్నారు. సగటు మనిషి గొంతును వినిపించేందుకు ఆప్ వాలంటీర్ల బృందాన్ని రంగంలోకి దింపింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నగరంలోని ఐదు ప్రధాన ఎఫ్‌ఎం స్టేషన్ల ద్వారా ఎడతెరపి లేకుండా ప్రచారం చేయాలని ఆప్ నిర్ణయించింది.
‘ఢిల్లీ డైలాగ్’పై విస్తృత ప్రచారం
పార్టీ ‘ఢిల్లీ డైలాగ్’ను ప్రధాన అంశంగా ప్రచారం చేయనుంది. కొన్ని నిమిషాలపాటు కేజ్రీవాల్ వ్యక్తిగత ప్రచారాన్ని కూడా చేపడతున్నారు. రాజధాని నగరంలో ప్రజలు రోజువారి ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాలను చూపిస్తూ ప్రచారం చేయనున్నారు. ‘యూత్ డైలాగ్ నమునా’లో అన్ని వర్గాల పేద ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నారు. రేడియో ప్రచారంలో కూడా దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే నగరంలో 20 కొత్త కాలేజీలను నిర్మిస్తామని ఆప్ ప్రచారం చేస్తోంది. మహిళ సమస్యలను కేజ్రీవాల్ అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తారనే విషయాలను తెలియజేస్తున్నారు. ప్రజలకు ‘విద్యుత్, నీళ్లు’ అనే ప్రచారాన్ని ముందుకు తీసుకొస్తున్నారు.
4 గంటల పాటు కేజ్రీవాల్ ఇంటర్వ్యూ
పార్టీ అధినేత కే జ్రీవాల్ గత వారం ఎఫ్‌ఎం రేడియో చానల్ ఆహ్వానించింది. నాలుగు గంటల పాటు ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆప్ ప్రచారం ఎఫ్‌ఎం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎఫ్‌ఎం రేడియో కీలక పాత్ర పోషించింది. ఎఫ్‌ఎం రేడియోను పార్టీ రెండు కారణాల దృష్ట్యా ప్రచారానికి ఎంచుకొంది. మొద టిది ప్రింట్,టీవీ మీడియాల కన్నా ప్రసార ఖర్చులు తక్కువగా ఉండడం, రెండోది సాధారణ ప్రజలకు ఎఫ్‌ఎం రేడియో అందుబాటులో ఉంటుంది.
ఎఫ్‌ఎంలో ఆప్ ముమ్మర ప్రచారం
Published Sun, Dec 7 2014 11:07 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement