ప్రేమించి పెళ్లి చేసుకుంటా!
నాది ప్రేమ బాటేనంటున్నారు నటుడు ఆర్య. కోలీవుడ్‌లో ఆర్య పేరు చెప్పగానే ప్రేమ పూజారి అంటారు. దాదాపు ప్రముఖ కథానాయికలు అందరూ ఇష్టపడే నటుడు ఆర్య.హీరోయిన్లలో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిరియానీ విందులతోనే వారిని ఆకట్టుకుంటారనే పేరూ ఆర్యకు ఉంది. కాగా తాజాగా నటుడు క్రిష్ణతో కలిసి విష్ణువర్ధన్ దర్శకత్వంలో నటించిన యట్చన్ చిత్రం శుక్రవారం తెరపైకిరానుంది. ఈ సందర్భంగా ఆర్యతో చిట్‌చాట్.
ప్రశ్న: విష్ణువ ర్దన్ దర్శకత్వంలో వరుసగా ఐదు చిత్రాల్లో నటిండానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా?
జవాబు: విష్ణువర్దన్ నాకు మంచి ఫ్రెండ్ అంతకంటే కారణం అంటూ ఏమీలేదు. అలాగని షూటింగ్‌లో ఆయన నాపై స్పెషల్ శ్రద్ధ ఏమీ తీసుకోరు. యట్చన్ చిత్రం కోసం ఒక ఎత్తై బ్రిడ్జిపై నుంచి క్రిందకు దూకమన్నారు. నేను తటపటాయిస్తుంటే ముందు నేను దూకనా అంటూ ఆ ప్రయత్నం చేయబోగా నేనే దూకేశాను.
ప్రశ్న: మీతో నటించే హీరోయిన్లకు బిరియానీ విందు ఇస్తుంటారు. ఈ చిత్ర నాయకి దీపా సన్నిధికి బిరియానీ విందునిచ్చారా?
జ: ఇంకా ఆమె బిరియానీ విందు తీసుకోలేదు. అందుకు పూర్తిగా భిన్నమైన మనస్తత్వం నటి స్వాతిది. ఈమెను మాట్లాడకుండా కట్టడి చేయడం కష్టం. లొడలొడా మాట్లాడేస్తారామె.
ప్రశ్న: ఇంటిలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది?
జ: వారికంత శ్రమ కలిగించను. నాది ప్రేమ బాటే.పెద్దల అనుమతితో ప్రేమ వివాహమే చేసుకుంటాను.అయితే నేను ప్రేమించే అమ్మాయి సినిమా హీరోయిన్ అవుతుందా?లేక వేరే అమ్మాయి అవుతుందా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు.
ప్రశ్న: ఆ మధ్య నటి నయనతార ఎక్కడున్నా బాగుండాలని స్టేట్‌మెంట్ ఇచ్చారు.దాని భావమేమిటి?
జ: ఇప్పుడూ అంటున్నాను. నయనతార ఎక్కడున్నా బాగుండాలి.కారణం ఆమె నాకు మంచి స్నేహితురాలు.