ఎన్నికల కమిషన్‌కు డీఎంకే ఫిర్యాదు
సచివాలయంలో అఖిలపక్ష సమావేశం
చెన్నై, సాక్షి ప్రతినిధి:
రాష్ట్రం నలుమూలల విస్తరించి ఉన్న ముఖ్యమంత్రి జయలలిత చిత్ర పటాలను, రెండాకుల చిహ్నాలను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా తొలగించాలని డీఎంకే సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నికల కమిషన్‌ను కోరారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధి విధానాలను చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సచివాలయంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంకే తదితర ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ పై అనేక ఫిర్యాదులు చేశారు. అమ్మ వాటర్ బాటిళ్లు, ప్రభుత్వ మినీ బస్సులపై రెండాకుల చిహ్నం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల్లో ఉంచిన సీఎం జయలలిత ఫొటో లు, మెరీనాబీచ్ అన్నా సమాధి ప్రవేశద్వారం వద్దనున్న రెండాకుల చిహ్నంను కప్పివేయాలని, రోడ్ల వెంబడి ఉన్న అమ్మ ఫ్లెక్సీలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
అన్నాసమాధి విషయంపై ప్రధాన ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాశామని, మిగిలిన అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో గుర్తింపు పొంది, ఆహ్వానం అందుకున్న పార్టీలను మాత్రమే సమావేశానికి అనుమతించారు. అన్నాడీఎంకే తరపున పొల్లాచ్చి జయరామన్, సేతురామన్, డీఎంకే నుంచి ఆలందూర్ భారతి, పరంధామన్, కాంగ్రెస్ నుంచి కోవై తంగం, సేలంబాలు, బీజేపీ నుంచి శరవణ పెరుమాళ్, డీఎండీకే తరపున ఎమ్మెల్యేలు చంద్రకుమార్, పార్థసారథి, సీపీఐ తరపున పళనిసా మి, సేతురామన్, సీపీఎం తరపున రమణి, బహుజన సమాజ్ పార్టీ నుంచి రజనీ సమావేశానికి హాజరయ్యూరు. ఆమ్ ఆద్మీ నుంచి ఖాజీమెహిద్దీన్, హబీ సచివాలయం వద్దకు చేరుకున్నారు. వారిని అనుమతించలేదు. తమను అనుమతించకపోవడంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని మీడియాకు తెలిపారు.
‘అమ్మ’ బొమ్మలు తొలగించండి
Published Sat, Mar 8 2014 2:41 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement