కాంగ్రెస్ వ్యతిరేక తీర్పు
- అంగీకరించిన సోనియూ, రాహుల్
- ఎన్నికల్లో ఓటమికి తమదే బాధ్యత అని వెల్లడి
న్యూఢిల్లీ: ముందెన్నడూ లేనివిధంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురైన ఘోర పరాజయూనికి తాము బాధ్యత వహిస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియూగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రజల తీర్పు స్పష్టంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉందని అంగీకరించారు. దీనిపై తాము ఆలోచించాల్సింది ఎంతో ఉందని అన్నారు. అదే సమయంలో సామాజిక సామరస్యత కోసం, దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని వారు స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియూ, రాహుల్ కొద్దిసేపు మీడియూతో మాట్లాడారు. అరుతే విలేకరులు ప్రశ్నలు అడిగేందుకు మాత్రం వారు అవకాశం ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వానికి ఇద్దరు నేతలు అభినందనలు తెలిపారు. పార్టీ విధానాలు, సాధించిన విజయూలు, సిద్ధాంతాల ఆధారంగా కాంగ్రెస్ తన ప్రత్యర్థులతో పోరాడిందని సోనియూ చెప్పారు. అరున ప్పటికీ తాము ఆశించిన మద్దతు లభించలేదన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఓటమికి బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. అంతకుముందు రాహుల్ మాట్లాడుతూ.. ప్రజల తీర్పు బీజేపీకి అనుకూలంగా ఉందని, వారిని అభినందిస్తున్నట్టు చెప్పారు. ఓటమిని పార్టీ సమీక్షించాల్సి ఉందని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి నేతృత్వం వహించిన రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పూర్తి వినమ్రంగా ఓటమికి బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎన్నికల ఫలితాలతో పూర్తి నిరాశకు గురైనట్టు కాంగ్రెస్ సీనియర్ నేత సత్యవ్రత్ చతుర్వేది చెప్పారు. ప్రచారంలో భారీయెత్తున డబ్బు వ్యయం చేయడం, మోడీ ప్రయోగించిన కులం కార్డుతో బీజేపీ లబ్ధి పొందిందని కాంగ్రెస్ మరో నేత మీమ్ అఫ్జల్ ఆరోపించారు.
సమిష్టిగా బాధ్యత వహిస్తాం
ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని, అరుుతే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. ఓటమికి సమిష్టిగా బాధ్యత వహిస్తామని చెప్పారు. తాము అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా.. వాటి గురించిన సందేశాన్ని తాము ప్రజలకు చేరవేయలేక పోయూమని అన్నారు.