స్మార్ట్ కు సన్నద్దం | At the suggestion of the reform are taken | Sakshi
Sakshi News home page

స్మార్ట్ కు సన్నద్దం

Published Sat, Jun 4 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

స్మార్ట్ కు సన్నద్దం

స్మార్ట్ కు సన్నద్దం

కరీంనగర్‌కు అన్ని అర్హతలున్నారుు
కేంద్రం సూచన మేరకు సంస్కరణలు చేపడుతున్నాం..
మూడో విడతలో మన కల నెరవేరుతుంది..
కరీంనగర్ మేయర్  రవీందర్‌సింగ్

 
కరీంనగర్ కార్పొరేషన్ : స్మార్ట్‌సిటీ కరీంనగర్ ప్రజల కల.. ఆ కలను నెరవేర్చేందుకు, జిల్లా కేంద్రానికి స్మార్ట్‌హోదా సాధించి పెట్టేందుకు అధికార యంత్రాంగం, పాలకవర్గం తీవ్రం గా శ్రమించింది. తెలంగాణలో మూడు పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. అప్పటి నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం నిర్విరామ కృషిచేసి నివేదిక తయారుచేసి కేంద్రానికి అందజేశారు. 87మార్కులు సాధించినా రాజకీయ సమీకరణాలు వరంగల్ వైపే మొగ్గుచూపాయి.

అయినా నిరాశ చెందకుండా ప్రతి అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి స్మార్ట్ హోదాకు తమ ప్రయత్నాలను కొనసాగించారు. అరుుతే రెండు సిటీలకే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌కు బదులుగా కరీంనగర్ పేరును జాబితాలో చేర్చడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ మూడో జాబితాలో స్మార్ట్ సిటీని కచ్చితంగా సాధించి తీరుతామని మేయర్ రవీందర్‌సింగ్ చెబుతున్నారు. స్మార్ట్ సిటీ హోదా కోసం బల్దియా చేసిన ప్రయత్నాలు, చేయబోయే కార్యక్రమాలు ఆయన మాటల్లోనే...
 ముందు వరుసలో ఉన్నాం..

ఇప్పటివరకు రెండు విడతల్లో  33నగరాలు స్మార్ట్ హోదా దక్కించుకున్నారుు. వాటికి కరీంనగర్ ఏ మాత్రం తీసిపోదు. ఏడాదిన్నరగా స్మార్ట్‌హోదా దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం మార్కుల పట్టికలో ముందువరుసలో ఉన్నాం. తెలంగాణకు రెండు స్మార్ట్ నగరాలకే పరిమితం చేయడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు బదులు కరీంనగర్‌ను జాబితాలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేశారు. అప్పటినుంచి ఎంపీ వినోద్‌కుమార్ స్మార్ట్ హోదా కల్పించేందుకు కృషిచేస్తున్నారు.

 అన్ని అర్హతలున్నాయి..
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌తర్వాత అన్ని అర్హతలు కలిగిన మూడో పెద్ద నగరం కరీంనగరే. వరంగల్‌కు స్మార్ట్ హోదా దక్కడంతో మిగిలింది కరీంనగరం మాత్రమే. పోటీకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. మార్కుల పట్టికలో ఏడాదిన్నర క్రితం తొలి ప్రయత్నంలోనే 85 మార్కులు సాధించాం. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. హోదాకు సరిపడా 90మార్కులు ఇప్పుడు ఉన్నాయి. సాంకేతిక అంశాల విషయంలో కొంత ముందుకు వెళ్లాల్సి ఉంది.

 కేంద్ర మంత్రి సూచనతో..
 కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్మార్ట్ హోదా ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. చిన్నచిన్న మార్పులు చేసుకోవాలని ఫోన్‌లో సూచించారు. ఆయన సూచనల మేరకు పనిచేస్తున్నాం. ఆదాయ వనరుల పెంపు, ప్రజలకు జవాబుదారీతనం, స్వచ్ఛభారత్ వంటి అంశాల్లో మెరుగుపరుచుకున్నాం. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్ స్మార్ట్ హోదా కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

 ఆదాయ వనరుల పెంపునకు చర్యలు
 ఆదాయ వనరుల పెంపు కోసం ఒక్క రూపాయికే నల్లాను ప్రవేశపెట్టాం. ఇప్పటివరకు వెరుు్య కనె ్షకన్లు ఇచ్చాం. నల్లాపన్ను ద్వారా నెలకు రూ.10లక్షల ఆదాయం పెరిగింది. రోజు 50నల్లాకనెక్షన్లకు దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజలపై భారం పడకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టిసారించాం. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఒక్క రోజే 50వేల మందితో నగరాన్ని శుభ్రం చేశాం. స్వచ్ఛ కరీంనగర్ కోసం కృషిచేస్తాం.

 సింగిల్‌విండో విధానం
 పౌరసేవలు పకడ్బందీగా అమలు చేసి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నాం. పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. దరఖాస్తుదారుడు పౌరసేవా కేంద్రంలో దరఖాస్తు చేసి అక్కడి నుంచే ధ్రువీకరణ పొందేలా ఏర్పాట్లు చేశాం.

 మూడో విడతలో ఖాయం
 కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా మూడో విడతలో రావడం ఖాయం. కేంద్ర ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది. గత నెలలో కమిషనర్‌కు కృష్ణభాస్కర్ ఢిల్లీలో జరిగిన స్మార్ట్ సిటీల సమావేశానికి ఆహ్వానం అందుకుని హాజరయ్యారు. కేంద్ర కేబినెట్ ప్రొసీడింగ్ ఇస్తే స్మార్ట్ హోదా వచ్చినట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement