
సాక్షి, మెదక్: లోక కళ్యాణార్ధం ముఖ్యమంత్రి కేసీఆర్ చేయిస్తున్న సహస్ర చండీయాగం నాలుగోరోజూ శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఉదయం పూజానంతరం 300 చండీ పారాయణాలు పూర్తి చేశారు. హోమంలో భాగంగా అరుణ పారాయణ మహాసారం, పంచ కాఠకముల పారాయణాలు, నవగ్రహ జపానుష్టానాలు, మహా మృత్యుంజయ జపం నిర్వహిస్తున్నారు. రేపు (శుక్రవారం) పూర్ణాహుతితో చండీయాగం పూర్తవుతుంది.