కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం జిల్లా కేంద్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం విరాళాలు సేకరించారు.
ఆదిలాబాద్ కల్చరల్ : కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం జిల్లా కేంద్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం విరాళాలు సేకరించారు. ముందుగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న నుంచి సొసైటీ సభ్యులు విరాళం స్వీకరించారు. ఈ నెల 19 నుంచి కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం జిల్లాలో విరాళాలు సేకరిస్తున్నట్లు సభ్యులు తెలిపారు.
బ్యాంకులు, దుకాణాలు, ప్రముఖుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు సొసైటీ అన్నివేళల్లో ముందుంటుందని సభ్యుడు బాలశంకర్‌కృష్ణ తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రాంచంద్ర మహాత్మ, సతీశ్, గంగేశ్వర్, హక్, విజయకుమార్, మిట్టు రవి, బండారి దేవన్న, జమీర్ తదితరుల పాల్గొన్నారు.