సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఫైర్‌బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు అందింది. రేణుకపై ఫిర్యాదు అనగానే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులే చేసి ఉంటారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఈసారి ఆ అవకాశాన్ని ఇతర జిల్లాల నాయకులు తీసుకున్నారు. జిల్లాలో ఆమెను వ్యతిరేకించే నేతలతో సంబంధం లేకుండానే ఇతర జిల్లాలకు చెందిన పార్లమెంటు సభ్యులు పార్టీ అధినేత్రికి లేఖ రాశారు.
వివరాల్లోకి వెళితే....
రానున్న సార్వత్రిక ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇటీవలే తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎంపీ రేణుకాచౌదరికి కూడా స్థానం కల్పించారు. మొత్తం 23 మంది సభ్యులున్న ఈ కమిటీలో రేణుకకు స్థానం కల్పించడాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేక ృందానికి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వం వహిస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.
తెలంగాణ ఉ ద్యమాన్ని, ఈ ప్రాంత ప్రజల పోరాటాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రేణుకకు తెలంగాణ ప్ర దేశ్ ఎన్నికల కమిటీలో ఎలా స్థానం కల్పిస్తారని ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, దిగ్విజయ్‌ను పొన్నం ప్రశ్నిస్తున్న సమయంలో సమావేశంలోనే ఉన్న రేణుక మాత్రం మౌనంగానే ఉన్నారని సమాచారం. అంతటితో ఆగకుండా ఎంపీ పొన్నం ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాకు ఫిర్యాదు లేఖ రాశారని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి.
ఈ ఫిర్యాదుపై తెలంగాణ ప్రాంతానికి చెందిన అందరు ఎంపీల సంతకాలను కూడా తీసుకున్నట్లు సమాచారం.ఎట్టి పరిస్థితుల్లో రేణుకకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో స్థానం కల్పించవద్దని ఆ లేఖలో సోని యాను కోరినట్లు తెలిసింది. మరి ఈ ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకుంటారా? రేణుకకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి పనిచేస్తుందా? ఏం జరుగుతుందన్నది తేలాల్సి ఉంది.
‘మేడమ్’పై ఫిర్యాదు
Published Sat, Mar 15 2014 2:04 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement